THE TELANGANA HIGH COURT HAS ISSUED DIRECTIONS TO CONTINUE ONLINE CLASSES IN EDUCATIONAL INSTITUTIONS TILL THE 20TH OF THIS MONTH PRV
Telangana Schools and colleges: ఈనెల 20 వరకు ఆన్లైన్ క్లాసులు చెప్పండి.. తెలంగాణలో తరగతుల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలు..
కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా హైకోర్టు విద్యాసంస్థల్లో ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలోని విద్యాసంస్థ (Telangana Schools and colleges)ల్లో ఈ నెల 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు, ఆన్లైన్ క్లాసులు కూడా బోధించాలని హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది.
2/ 8
కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా హైకోర్టు విద్యాసంస్థ (Telangana Schools and colleges)ల్లో ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
3/ 8
బార్లు, రెస్టారెంట్ల మార్కెట్లు వద్ద కరోనా నిబంధనలను అమలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. సమ్మక్క, సారక్క జాతరలో కూడా కరోనా నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు (Telangana High-count) సూచించింది.
4/ 8
రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై ఈ నెల 20వ తేదీన విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు తెలిపింది.
5/ 8
కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు తెలంగాణోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల 17 నుండి ఈ నెల 31వ తేదీ వరకు సెలవులను పొడిగించింది .
6/ 8
అయితే ఆన్లైన్ క్లాసులతో విద్యార్ధులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్న తరుణంలో విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి విద్యా సంస్థలను పున: ప్రారంభించింది.
7/ 8
దీంతో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడంతో ఆన్ లైన్ క్లాసులను కూడా కొనసాగించాలని ఇవాళ హైకోర్టు ఆదేశించింది.
8/ 8
ఆన్ లైన్ క్లాసుల కారణంగా విద్యార్ధులకు పాఠాలు సరిగా అర్ధం కాలేదని ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలతో తెలిసిపోయిందని విద్యా వేత్తలు వాదిస్తున్నారు. దీంతో ఆన్ లైన్ క్లాసుల కంటే ఎక్కువగా ఆఫ్ లైన్ క్లాసులను నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది.