School Holidays: విద్యార్థులకు శుభవార్త.. రెండు రోజులు సెలవులు..
School Holidays: విద్యార్థులకు శుభవార్త.. రెండు రోజులు సెలవులు..
వేసవి దృష్ట్యా ఇప్పటికే మార్చి 15 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణలో ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో ఈ నెలలో మరో రెండు రోజులు సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలిలా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా రేపు (మార్చి 22)న సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
అంతే కాకుండా.. ఇదే నెలలో మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా ఆ రోజు కూడా విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులను జారీ చేసింది. ఈ రెండు రోజులు అన్ని విద్యాసంస్థలతో పాటు.. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వర్తించనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 03వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో.. పదో తరగతి పరీక్ష సెంటర్లు గల లస్కూళ్లు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూళ్లను నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
వేసవి దృష్ట్యా ఇప్పటికే మార్చి 15 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణలో ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం ఏప్రిల్ మొదటి వారంలో ఒంటిపూట బడులు నిర్వహించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఇక వీటితో పాటు.. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని ఇప్పటికే విద్యాశాఖ పేర్కొంది. మొత్తం 48 రోజుల సెలవుల అనంతరం.. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఇక.. ఈ ఏడాది సమ్మేటివ్ అసెస్మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
అయితే.. సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. 10వ తరగతి పరీక్షల కారణంగా ఈ ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
దీంతో 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుండి పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 20వ తేదీ వరకు జరుగుతాయి. అనంతరం ఏప్రిల్ 25 నుండి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)