ఈ ఏడాది కూడా కోవిడ్ థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ఉంటాయా..? లేదా అనే ఆలోచనలో పడిపోయింది విద్యాశాఖ. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల తర్వాత పరీక్ష షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
అయితే అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇటీవల పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ ఉత్తర్వు జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పూర్తి వివరాలతో కూడిన జాబితాను రూపొందించి త్వరగా వీటిని జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపాలని ఆదేశించారు. త్వరలో పదో తరగతి సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేపట్టాలని, పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని ఆదేశించారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ (Inter Practical Exams)కి సంబంధించి ఇటీవలె కీలక ప్రకటన చేసింది. ఇంటర్ విద్యార్థులకు (Inter Students) మార్చిలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల కాలేజీల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు (Inter Practical Exams) ఉంటాయని వెల్లడించారు.