THE RESULTS OF THE SECOND YEAR OF INTERMEDIATE IN TELANGANA WILL BE REVEALED TOMORROW VB
TS Inter Results: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. మార్కుల కేటాయింపు ఇలా..
Inter Second Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
కరోనా నేపథ్యంలో ఇంటర్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇవ్వనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించనున్నారు (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)