10th Class Results: ‘పది’ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రెండు మూడు రోజుల్లో ఫలితాలు.. వారికి 10/10 జీపీఏ..
10th Class Results: ‘పది’ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రెండు మూడు రోజుల్లో ఫలితాలు.. వారికి 10/10 జీపీఏ..
10th Class Results: పదో తరగతి పరీక్ష ఫలితాలను రెండు, మూడు రోజుల్లో ప్రకటించేందుకు విద్యాశాఖ సమాయత్తమైనట్లు తెలుస్తోంది. ఈ సారి గతేడాది కంటే ఎక్కువ మందికి 10/10 జీపీఏ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పూర్తి వివరాలు తెలుసుకోండి.
తెలంగాణలో కరోనా కారణంగా వరుసగా రెండు సంవత్సరాలు పదో తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. గతేడాది (2019-20) పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ అనెస్ మెంట్(ఎస్ఏ-1) ఆధారంగా గ్రేడ్లను కేటాయించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 12
కానీ ఈ సారి ప్రత్యక్ష తరగతులు తక్కువగా 40 రోజులు మాత్రమే జరగడంతో ఫార్మేటివ్ అనెస్ మెంట్(ఎస్ఏ-1) ఆధారంగానే గ్రేడ్లు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 12
ఆ ప్రకారం విద్యాశాఖ ఇన్ ఛార్జి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నెల 11న ఉత్తర్వులిచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 12
ఈ విద్యాసంవత్సరం (2020-21) కేవలం 40 రోజులే ప్రత్యక్ష తరగతులు జరగడంతో ఆ సమయంలోనే ఒక ఎస్ఏ జరిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 12
మరోసారి ఎస్ఏ నిర్వహించాల్సి ఉండగా పాఠశాలలను మూసేశారు. దీంతో ఒక్క ఎస్ఏ ప్రకారమే గ్రేడ్లను కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 12
ఈ సారి దాదాపు పరీక్ష రుసుం చెల్లించిన 5,21,398 మందికి గ్రేడ్లను కేటాయించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 12
వీరిలో సమారు 2 లక్షల మంది 10/10 జీపీఏతో ఉత్తీర్ణులు కానున్నారని సమాచారం. అంటే గత సంవత్సరం కంటే దాదాపు 60 వేలు ఎక్కువ మంది ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 12
అప్పుడు 5.84 లక్షల మందిలో మొత్తం 1,41,882 మంది విద్యార్థులు 10 జీపీఏ దక్కించుకున్న విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 12
ప్రతీ విద్యార్థికి గ్రేడ్లను కేటాయించేందుకు పరీక్షల విభాగం అధికారులు ప్రక్రియను దాదాపు పూర్తిచేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 12
ఫలితాలను రెండు, మూడు రోజుల్లో విడుదల చేసేందుకు సమాయత్తమయ్యారు. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 12
2 లక్షల మందికి 10/10 జీపీఏ ఇవ్వడానికి గల కారణం ఒక్క ఎస్ఏ ఆధారంగా గ్రేడ్లు ఇవ్వడమే అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)