జగన్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. గుంటూరు జిల్లా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టులను భర్తీ చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 14, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 13, ఫిజియో థెరపిస్ట్ పోస్టులు 01, ప్లంబర్ 03, శానిటరీ వర్కర్ కమ్ వాచ్ మెన్ 13, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 06, ఓటీ టెక్నీషియన్ 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తి వివరాలకు htttp://guntur.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)