THE DEPARTMENT OF EDUCATION IS WORKING TOWARDS CONDUCTING INTER FIRST YEAR EXAMINATIONS IN TELANGANA VB
Telangana Students: త్వరలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు.. పరీక్ష సమయం భారీగా కుదింపు.. వివరాలివే..
Telangana Students: తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. కరోనా కారణంగా మొదటి సంవత్సరం పరీక్షలను రద్దుచేసి సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేశారు. తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. పూర్తి విరాలు ఇలా ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో విద్యారంగం మొత్తం అతలా కుతలం అయింది. ఈ విద్యాసంవత్సరంలో దాదాపు అన్ని పరీక్షలను వాయిదా వేశారు. మరికొన్ని పరీక్షలను రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం )
2/ 8
అందులో భాగంగానే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఎలాంటి పరీక్ష లేకుండానే సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేశారు. అయితే వారికి మార్కులను కేటాయించే విషయంలో మాత్రం విద్యాశాఖ అధికారులు కాస్త గందరగోళానికి గురవుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
35 శాతం మార్కులను తీసుకోవడానికి కొందరు విద్యార్థులు విముఖంగా ఉన్నారు. దీంతో వారికి ఏ ప్రాతిపదికన వాళ్లకు మార్కులను కేటాయించాలో పాలుపోవడం లేదు. అయితే మళ్లీ కరోనా థర్డ్ వేవ్ వస్తే మాత్రం పరీక్షలను నిర్వహించడం అనేది చాలా కష్టంగా మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం )
4/ 8
అందుకే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షను నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది. (ప్రతీకాత్మక చిత్రం )
5/ 8
అయితే తాజాగా పరీక్షల సమయాన్ని కుదించాలని విద్యాశాఖ యోచిస్తోంది. గతంలో సమయం మూడు గంటలు ఉండగా, కరోనా నేపథ్యంలో గంటన్నరకు కుదించాలని యోచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం )
6/ 8
ప్రశ్నపత్రాలను కూడా సులువుగా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి మళ్లీ ఫీజులు చెల్లించనవసరం లేకుండానే, గతంలో చెల్లించిన వారికి అవకాశం ఇవ్వనున్నా రు. (ప్రతీకాత్మక చిత్రం )
7/ 8
గతంలో ఫీజు చెల్లించని వారు ఇప్పుడు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. వీటిపై ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. (ప్రతీకాత్మక చిత్రం )
8/ 8
సెకండియర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షల్లోని మార్కులను ప్రాతిపదికగా తీసుకొని పాస్ చేసిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం ) (Image credit : twitter)