ప్రైవేటు విద్యా సంస్థలు (Private Educational Institutes) ప్రత్యేక ట్యూషన్ ఫీజుల పేరుతో అధిక మొత్తంలో దండుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గతకొద్దిరోజులుగా ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నడుం బిగించింది. అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించేందుకు (Telangana) సర్కార్ కసరత్తు చేస్తోంది.
ఫిబ్రవరి 21న మంత్రులతో కూడిన మంత్రివర్గ సబ్ కమిటీ (The cabinet sub-committee) ఫీజులకు సంబంధించి సమావేశం కానుంది. ఇందులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల ఫీజుల నియంత్రణకు సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక తయారు చేస్తుంది.
వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రతి విద్యాసంవత్సరంలో ట్యూషన్ ఫీజును 30 శాతం నుంచి 40 శాతం వరకు పెంచుతున్నాయి. అదే విధంగా జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి వివిధ ప్రవేశ పరీక్షల కోసం ఇంటెన్సివ్, స్పెషల్ కోచింగ్ అంటూ అధిక మొత్తంలో ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయి . (ప్రతీకాత్మక చిత్రం)