తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 04 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లాల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల నీడలో పరీక్షలు పెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోలీసు బందోబస్తు ఉంటుంది. హై పవర్, పరీక్షల నిర్వహణ కమిటీ, డీవీఈఓ, ఆర్ఐఓ లు కూడా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)