విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లను స్థానికంగా ఉండే పేదలకు కేటాయించాలి. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద విద్యార్ధులకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవో జారీ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ జీవో ప్రకారం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 03 నుంచి ఏప్రిల్ 30 వరకు ఒకటో తరగతి అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీని తర్వాత మార్చి 18 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 07తో ముగియనుంది. అయితే ఈ సీట్లను కూడా లాటరీ విధానంలో కేటాయిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)