కరోనా నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష దరఖాస్తుల విషయమై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
దరఖాస్తు గడువును పొడిస్తూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఈ నెల 17 వరకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎంసెట్ పరీక్ష కోసం అప్లై చేసుకోవచ్చని పరీక్ష కన్వీనర్ గోవర్దన్ వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంసెట్ ఎగ్జామ్ కు 2,20,027 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
ఇందులో ఇంజనీరింగ్ విభాగంలో 1,46,541 అగ్రికల్చర్ విభాగంలో మరో 73,486 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ దరఖాస్తు గడువు మే 18న ముగియాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఆ గడువును అనేక సార్లు అధికారులు పొడిగించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
తాజా గడువు ఈ రోజు అంటే జూన్ 10తో ముగియాల్సి ఉండగా.. మరోసారి 17 వరకు పొడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాటిని వాయిదా వేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు.. నూతన షెడ్యూల్ కూడా విడదల కానున్నట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)