TS TET 2022 Results: ప్రశాంతంగా ముగిసిన టెట్.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?
TS TET 2022 Results: ప్రశాంతంగా ముగిసిన టెట్.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?
ఈ రోజు నిర్వహించిన తెలంగాణ టెట్ ఎగ్జామ్ (TS TET 2022 Exam) ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా టెట్ ఫలితాల (TS TET Results) తేదీలపై ఎగ్జామ్ కన్వీనర్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో ఈ రోజు నిర్వహించిన టెట్-టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రశాంతంగా ముగిసినట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం నిర్వహించిన పేపర్-1 కు సంబంధించి మొత్తం 3,18,506 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఆయన వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 3
ఇక పేపర్-2 విషయానికి వస్తే.. 2,51,070 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఆయన వివరించారు. ఇంకా ఫలితాలను వెల్లడించే తేదీని సైతం టెట్ కన్వీనర్ రాధా రెడ్డి వెల్లడించారు. ఈ నెల 27న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 3
అయితే.. ఒక్క నిమిషం నిబంధన అనేక మంది అభ్యర్థులకు షాపంగా మారింది. సూర్యాపేట జిల్లాలో ఓ మహిళా అభ్యర్థి పరీక్షా కేంద్రానికి ఒక నిమిషం ఆలస్యంగా రావడంతో అక్కడ ఉన్న అధికారులు లోనికి అనుమతించలేదు.