కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించలేదని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వైరస్ ప్రాభవం తగ్గడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ సారి పరీక్షా పేపర్లను 11 నుంచి 6కు కుదించించి విద్యాశాఖ. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే, విద్యార్థులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. మాస్క్ ధరించాలని సూచించారు. ఇంకా ఎగ్జామ్ సెంటర్లకు వాటర్ బాటిల్, శానిటైజర్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే.. పరీక్షా సమయానికి గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు హాజరుకావాలని అధికారులు సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
9.35 గంటలు తర్వాత అంటే 5 నిమిషాలు దాటితే కేంద్రాల్లోకి అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. వేసవి నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్లలో ఏఎన్ఎం, ఆశా ఉద్యోగులకు విధులు కేటాయించారు. వారు కావాల్సిన మందులతో సిద్ధంగా ఉంటారని అధికారులు తెలిపారు. వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో మంచినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా ఎగ్జామ్ సెంట్లల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా పరీక్ష పూర్తయ్యే వరకు జిరాక్స్ కేంద్రాలు మూసివేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ప్రశ్నాపత్రం లీకేజీకి ఆస్కారం లేకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే డీఈవోలు, ఎంఈవోలదే బాధ్యతని ఆదేశాలు జారీ అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
టెన్త్ ఎగ్జామ్స్ లో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా, టెక్నాలజీని వినియోగించి పేపర్ లీక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సెస్సీ బోర్డు హెచ్చరించింది. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసినా, వీడియోలు తీసినా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీస్ అండ్ ఉంటుందని తెలిపింది. గరిష్ఠంగా మూడేండ్లు శిక్ష, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా ఉంటుందని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని. బస్‌పాస్ వ్యాలిడిటీ అయిపోయినా కూడా ఆ బస్ పాస్ తో పాటు టెన్త్ హాల్‌టికెట్ చూపిస్తే పరీక్ష కేంద్రానికి, పరీక్ష కేంద్రం నుంచి రిటర్న్ జర్నీని కూడా ఉచితంగా పొందవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. రేపటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పలు సూచనలు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్స్ రాయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడి, భయానికి తావు లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సబితారెడ్డి. (ప్రతీకాత్మక చిత్రం)