తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షల సందడి ముగిసింది. ప్రస్తుతం రిజల్ట్స్ హడావుడి సైతం మొదలైంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే తెలంగాణలోనూ టెన్త్, ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
వాల్యుయేషన్ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో వారు పని చేస్తున్నారు. వాల్యుయేషన్ అనుకున్న తేదీకి పూర్తి అయితే.. ఈ నెల 30లోగా రిజల్ట్స్ వెల్లడిస్తామని ఎస్సెస్సీ బోర్డ్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా రాష్ట్రంతో పాటుగా దేశ వ్యాప్తంగా విద్యావ్యవస్థ అంతా గందరగోళంగా మారిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)