Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఇప్పట్లో ఆ నోటిఫికేషన్ లేనట్లే?
Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఇప్పట్లో ఆ నోటిఫికేషన్ లేనట్లే?
తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని విభాగాల్లో ఖాళీల భర్తీపై సర్కార్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. మళ్లీ ఎన్నికల నాటికి కనీసం రెండు విడతల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సర్కార్ యోచిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
మొదటి విడతలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారులు లెక్కలు తీస్తున్నారు. అయితే ఈ ఖాళీల్లో అత్యధికంగా పోలీస్, టీచర్ ఉద్యోగాలు ఉంటాయని అంతా భావించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
కానీ టీచర్ ఉద్యోగాల భర్తీకి సర్కార్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో విద్యాశాఖలో కేవలం 1,384 ఖాళీలు మాత్రమే ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఇందులో 1024 ఖాళీలు మోడల్ స్కూళ్లకు చెందినవి కాగా.. గురుకుల విద్యాసంస్థల సొసైటీకి చెందినవి 183, జిల్లా గ్రంథాలయ సంస్థలో మరో 150, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆఫీస్ లో 22, ప్రభుత్వ పరీక్షల విభాగానికి చెందినవి మరో 5 ఖాళీలు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అయితే.. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్ 13 వేల ఖాళీలు విద్యాశాఖలో ఉన్నట్లు గతంలో తెలిపింది. అయితే ఇందులో హెడ్ మాస్టర్ ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసినా కూడా మరో 11 వేల ఖాళీలు ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
కానీ ఇటీవల మంత్రివర్గానికి సమర్పించిన లెక్కల్లో ఈ ఖాళీల ఊసే లేదు. దీంతో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
విద్యార్థులు తక్కువ, టీచర్లు ఎక్కువ ఉన్న చోట్ల రేషనలైజేషన్ చేపట్టి ఖాళీలు ఉన్న చోట సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ ఖాళీలను చూపలేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే ఇన్నాళ్లు టీచర్ కొలువు కోసం ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)