తెలంగాణలో మరో ఒకటి రెండు రోజుల్లో పోలీస్ జాబ్స్ (Telangana Police Jobs) కు సంబంధించిన నోటిఫికేషన్ ను TSLPRB విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. 80 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేస్తామన్న సీఎం ప్రకటన మేరకు ఈ రోజు ఆర్థిక శాఖ 30,453 ఖాళీల భర్తీకి అనుమతిలిస్తూ ఈ రోజు జీఓలు విడుదల చేసింది. ఇందులో పోలీస్ శాఖకు సంబంధించి 16,587 ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చింది ఆర్థిక శాఖ.
2/ 7
ఇందులో కానిస్టేబుల్(Civil) 4,965, కానిస్టేబుల్(AR) 4,423, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్(TSSP) 5,704, కానిస్టేబుల్(IT&C) 262, కానిస్టేబుల్(Driver) PTO 100, కానిస్టేబుల్(మెకానిక్) PTO 21, కానిస్టేబుల్(SARCPL) 100 ఉన్నాయి.
3/ 7
ఇంకా సబ్ ఇన్ స్పెక్టర్ (Civil) 415, రిజర్వ్ సబ్ ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(AR) 69, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టీఎస్ఎస్పీ) 23, సబ్ ఇన్ స్పెక్టర్ (IT&C) 23, సబ్ ఇన్ స్పెక్టర్(PTO), రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SARCPL) 05 ఉన్నాయి.
4/ 7
అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (FPB) 08, సైంటిఫిక్ ఆఫీసర్ (FSL) 14, సైంటిఫిక్ అసిస్టెంట్(FSL), ల్యాబ్ టెక్నీషియన్ (FSL), ల్యాబ్ అసిస్టెంట్ (FSL) 01 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది.
5/ 7
వీటితో పాటు స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ కు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ (SPF)-390, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SPF)-12 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. పోలీస్ శాఖలోని మొత్తం 16,587 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తూ జీఓ విడుదల చేసింది.
6/ 7
ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(TSLPRB) త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
7/ 7
ఇంకా డిప్యూటీ జైలర్ పోస్టులు 08, వార్డర్ 136, వార్డర్(ఉమెన్)-10 మొత్తం 154 ఖాళీల భర్తీకి సైతం ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసిది.