తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితారెడ్డి కొద్ది సేపటి క్రితం అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు.
2/ 11
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేసింది.
3/ 11
కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరంలో కేవలం 44 రోజులు మాత్రమే పాఠశాలలు నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థులకు ఒక ఫార్మేటీవ్ అసెస్మెంట్(FA-1) పరీక్షను నిర్వహించారు.
4/ 11
ప్రతీ సబ్జెక్టులో 20 మార్కులకు ఆ పరీక్ష నిర్వహించారు. ఈ మార్కులను ఐదింతలు పెంచి వంద మార్కులకు గానూ ఫలితాలను అధికారులు రూపొందించి విడుదల చేశారు.
5/ 11
విద్యార్థులకు గ్రేడ్ల కేటయింపు ఇలా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను 91-100 మార్కులు సాధించిన వారికి A1 గ్రేడ్‌ను కేటాయించారు. 81-90 మార్కులు సాధించిన వారికి A2, 71-80 మార్కులకు B1 గ్రేడ్ కేటాయించారు.
6/ 11
61-70 మార్కులు వచ్చిన వారికి B2, 51-60 మార్కులకు C1 గ్రేడ్, 41-50 మార్కులకు C2, 35-40 మార్కులు సాధించిన వారికి D, 0-34 మార్కులు వస్తే ఈ గ్రేడ్‌ను కేటాయించారు.
7/ 11
అయితే ఈ ఏడాది మొత్తం 5,21, 392 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో దాదాపు 2 లక్షల మంది ఏ1 గ్రేడ్ సాధించినట్లు తెలుస్తోంది.
8/ 11
వారంతా పాస్.. ఈ విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ స్కూళ్లలో పదో తరగతిలో 5,46,865 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఈ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150 నిర్ణయించారు.
9/ 11
లేట్ ఫీజు రూ.50 తో మార్చి 16 వరకు ఫీజు చెల్లించడానికి గడువు ఇచ్చారు. మార్చి 22 వరకు రూ.500 లేట్ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు విధించారు అధికారులు. అప్పటివరకు 5,21,392 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.
10/ 11
టెన్త్ లో అడ్మిషన్ పొందిన 25,473 మంది విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించలేదు. ఫీజు చెల్లించకపోవడంతో వారు FA-1 పరీక్షకు హాజరైనా అధికారులు పాస్ చేయలేదు. ఫీజు చెల్లించని వారు ఫెయిల్ అయినట్లేనని అధికారులు స్పష్టం చేశారు.
11/ 11
అయితే ఫలితాలు విడుదల చేసిన తర్వత నుంచే అధికారికి వెబ్ సైట్ https://www.bse.telangana.gov.in/ డౌన్ కావడంతో విద్యార్థులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సైట్ ఓపెన్ కావడం లేదని అనేక మంది విద్యార్థులు చెబుతున్నారు.