తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు శుభవార్త. ఈ పరీక్షకు సంబంధించిన కీని అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అయితే.. మొత్తం 8 ప్రశ్నలను డిలీట్ చేసినట్లు కీలో పేర్కొన్నారు అధికారులు. మరో 6 ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా వెల్లడించారు. ఇందులో ఒక ప్రశ్నకు 3 ఆప్షన్లను సరైనవిగా తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాలకు (TS SI Jobs) సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఈ నెల 7వ తేదీన నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కీని (TS SI Exam Key) అధికారులు తాజాగా విడుదల చేశారు. అభ్యర్థులు కీని https://www.tslprb.in/Pdfs/SI_PWT_ENGLISH_TELUGU.pdf ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)