తెలంగాణలో 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల (Telangana Police Jobs) భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ (TS Prelims Exams) కు సంబంధించిన తేదీలను సైతం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) విడుదల చేసింది. ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ రోజు విడుదల చేసింది. అభ్యర్థులు బోర్డ్ అధికారిక వెబ్ సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 5వ తేదీ రాత్రి 12 గంటల వరకు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)