అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా.. ఈనెల 5న పాఠశాలల బంద్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బంద్ కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంద్‌లో పాల్గొనాలని కోరారు.(ప్రతీకాత్మక చిత్రం)
బంద్ ను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఏబీవీపీ నేతలు. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమై దాదాపు నెల గడుస్తున్నా అనేక సమస్యలు పరిష్కారం అవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందించడకపోవడంపై ఏబీవీపీ నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్నసమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఫీజుల నియంత్రణ చట్టం అమల్లోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్న కార్పొరేట్ స్కూళ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)