తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ (TS POLYCET-2021) ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అభ్యర్థులు https://polycetts.nic.in/rank_card.aspx లింక్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఇదిలా ఉంటే.. పాలిసెట్ మొదటి విడత కౌన్సిలింగ్ ను ఆగస్టు 5 నుంచి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాలను పరిశీలనకు స్లాట్ బుకింగ్ ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అనంతరం 6 నుంచి 10 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 6 నుంచి 12 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం ఆగస్టు 14న సీట్ల కేటాయింపును నిర్వహిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
23 నుంచి ఆఖరి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆగస్టు 24 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్.. 24, 25 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఆగస్టు 27న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 1 తరగతులు ప్రారంభిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)