తెలంగాణలో పోలీస్ జాబ్స్ కు సంబంధించి మొత్తం 17 వేలకు పైగా పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించి పోలీసు శాఖ నిత్యం అభ్యర్థులకు సూచనలు చేస్తోంది. తాజాగా అభ్యర్థులకు మరో కీలక చేసింది తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB). అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది బోర్డు. (ప్రతీకాత్మక చిత్రం)
వివరాలు నమోదు చేసే సమయంలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలని వివరించింది. ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత మార్పులు చేసుకోవడం సాధ్యం కాదని, ఎడిట్ ఆప్షన్ ఉండదని బోర్డ్ స్పష్టం చేసింది. అప్లికేషన్ ఫామ్ లో నమోదు చేసుకున్న వివరాలన్నింటినీ సరి చూసుకున్న తర్వాతనే సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలని బోర్డ్ సూచించింది. దరఖాస్తుల్లో చేసిన తప్పులకు అభ్యర్థులే బాధ్యత వహించాలని బోర్డ్ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా ఫోన్ల ద్వారా అస్సలు అప్లై చేయొద్దని బోర్డ్ స్పష్టం చేసింది. కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. ఇంకా దరఖాస్తు చేసుకునే అన్ని పోస్టులకూ ఒకే ఫోన్ నంబర్ ఇవ్వాలని బోర్డు సూచించింది. దరఖాస్తు చేసే సమయంలో వేర్వేరు పోస్టులకు వేర్వేరు ఫోన్ నంబర్లు ఇవ్వొద్దని బోర్డు స్పష్టం చేసింది. 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయించనున్నట్లు బోర్డు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
కేవలం 5 శాతం ఖాళీలను మాత్రమే నాన్‌లోకల్ కేటగిరిలో ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు అర్హత ఉంటుందని బోర్డు తెలిపింది. ఇంకా అన్ని ఖాళీలకు ఒకే సారి దరఖాస్తు చేసుకోవాలనే రూల్ ఏమీ లేదని బోర్డు తెలిపింది. అభ్యర్థులు ఆఖరి తేదీ వరకు ఎప్పుడైనా ఏ పోస్టుకైనా అప్లై చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. అయితే ఒకే యూజర్ ఐడీలో అన్ని పోస్టులకు అప్లై చేసుకోవాలని సూచించింది బోర్డు వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా ఆదివాసీ అభ్యర్థులకు ఎత్తు 160 సెంటీ మీటర్లు ఉంటే సరిపోతుందని.. వారికి మినహాయింపు ఉంటుందని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇతర వర్గాల అభ్యర్థులు 167.6 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలని బోర్డు వివరించింది. వయో సడలింపు విషయంపై సైతం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టత ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు వయోసడలింపు వర్తించదని బోర్డు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు మాత్రమే వారి సర్వీసు ఆధారంగా 5 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుందని బోర్డు వివరించింది. ఇంకా ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, ఆర్టీసీ ఉద్యోగులకు వయోసడలింపు వర్తించదని బోర్డు వివరించింది. ఇంకా ఏదైనా కేసులో కోర్టులు దోషులుగా తేల్చిన అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులని బోర్డు స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)