Telangana Police Jobs: పోలీస్ జాబ్స్ కు అప్లై చేస్తున్నారా? ఈ ఫేక్ వెబ్‌సైట్‌తో జాగ్రత్త.. బోర్డు కీలక హెచ్చరిక
Telangana Police Jobs: పోలీస్ జాబ్స్ కు అప్లై చేస్తున్నారా? ఈ ఫేక్ వెబ్‌సైట్‌తో జాగ్రత్త.. బోర్డు కీలక హెచ్చరిక
తెలంగాణలో స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) కు సంబంధించి కొందరు సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్ సైట్ ను రూపొందించారు. దీంతో అధికారులు అభ్యర్థులకు కీలక హెచ్చరిక జారీ చేశారు.
తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ఇటీవల తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్లు సైతం విడుదల అవుతున్నాయి. ఇటీవల పోలీస్, గ్రూప్స్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
2/ 6
పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల్లో మొత్తం 17,291 ఖాళీల భర్తీకి, గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి 503 ఖాళీల భర్తీకి నిన్నటి నుంచి దరఖాస్తుల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
3/ 6
గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును నిర్ణయించారు అధికారులు. అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
4/ 6
గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
5/ 6
అయితే.. కొందరు సైబర్ నేరగాళ్ల ఇదే వెబ్ సైట్ల మాదిరిగా కొన్ని ఫేక్ వెబ్ సైట్లను తయారు చేసి అభ్యర్థులను బోల్తా కొట్టిస్తున్నారు. https://www.tslprb.in/ పేరును పోలిన tslprb.co.in వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు కేటుగాళ్లు.
6/ 6
ఆ వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే.. వివిధ ప్రకటనలో కూడిన ఇతర వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అయితే, దీనిని గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభ్యర్థులు ఈ విషయంపై జాగ్రత్తగా వ్యవహరించాలని ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు.