తెలంగాణ జాబ్స్, తెలంగాణ జాబ్ నోటిఫికేషన్, తెలంగాణ పోలీస్ జాబ్స్, తెలంగాణ గ్రూప్స్ జాబ్స్, మంత్రి కేటీఆర్, Minister KTR" width="1600" height="1600" /> వయోపరిమితి నిబంధన కారణంగా పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేయలేకపోతున్న అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. యూనిఫాం పోస్టులకు సంబంధించి ఇప్పటికే మూడేళ్ల పాటు వయో పరిమితి సడలింపు ఇచ్చిన సర్కార్.. తాజాగా మరో రెండేళ్లు వయోపరిమితి సడలింపు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి హోంశాఖ పంపించింది. ఈ ప్రతిపాదనలు సోమవారం ప్రభుత్వం వద్దకు చేరాయి. అయితే ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలను పరిశీలించి వయోపరిమితి పెంపుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు సైతం విడుదల కావొచ్చని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)