తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) 17 వేలకు పైగా ఖాళీల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2న ప్రారంభం కాగా.. దరఖాస్తులకు 20వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అయితే.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్, తర్వాత దేహదారుఢ్య పరీక్షలు, అనంతరం ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అర్హత సాధించిన అభ్యర్థులను ఫిజికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు. ఫిజికల్ టెస్టుల్లోనూ అర్హత సాధించిన వారికి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో సత్తా చాటిన వారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే, ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందో తెలియక అభ్యర్థుల్లో కాస్త గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)
పలు మీడియా సంస్థలకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. జూలై చివరి వారం లేదా ఆగస్టు రెండో వారంలో ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ముందుగా సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అనంతరం రెండు వారాలకు కానిస్టేబుల్, ఇతర జాబ్స్ కు అప్లై చేసిన అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను సెప్టెంబర్ చివరి వారంలోగా ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు శ్రీనివాసరావు వివరించారు. అక్టోబర్–నవంబర్ మధ్య దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫైనల్ ఎగ్జామ్ ను డిసెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు నిర్వహించాలని యోచిస్తున్నట్లు చెప్పారు ఆయన.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ను జనవరి ఆఖరి వారం లేదా ఫిబ్రవరి రెండో వారంలోపు ముగించాలని కార్యచరణ రూపొందిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. భారీగా నియామకాలు చేపట్టిన నేపథ్యంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు సైతం ఇప్పటి నుంచే ఏర్పాట్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)