తెలంగాణలో 20 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ఇప్పుడు రెండో దశకు చేరింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తయి ఇందుకు సంబంధించిన ఫలితాలు సైతం విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈ నెల 8వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు ఈ సారి సిద్దిపేటలో ఈవెంట్స్ ను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఈ సారి అత్యధునిక టెక్నాలజీని ఈవెంట్స్ నిర్వహణలో వినియోగిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎత్తును అత్యంత ఖచ్చితత్వతో కొలిచేందుకు డిజిటల్ హైట్ మీటర్లను వినియోగించనున్నారు. ఇంకా సీసీ కెమెరాల నీడలో ఈ ఈవెంట్స్ కొనసాగనున్నాయి. ఎవరైనా అభ్యర్థులు అభ్యంరాలు వ్యక్తం చేస్తే సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేస్తారు. ఇంకా ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరికాలను సైతం వినియోగించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈవెంట్స్ కు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. -అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు/ఇంటిమేషన్ లెటర్ ను A4 సైజ్ పేజీకి రెండు వైపులా ప్రింట్ తీసుకుని రావాల్సి ఉంటుంది. -అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ లో పేర్కొన్న సమయానికి గ్రౌండ్ కు రావాలని అధికారులు సూచించారు. లేట్ అయితే.. వారి అభ్యర్థిత్వం రద్దు అవుతుందని TSLPRB స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
-అభ్యర్థులు ఎలాంటి సమాను, విలువైన వస్తువులను వెంట తీసుకురావొద్దని స్పష్టం చేశారు. గ్రౌండ్లో సమాను భద్రపరుచుకునే ఎలాంటి సదుపాయం ఉండదని తెలిపారు. మహిళా అభ్యర్థులు నగలు, హ్యండ్ బ్యాగ్ లు వెంట తీసుకురావొద్దని తెలిపారు. ఇంకా చేతికి మెహిందీ, టాటూలు వేసుకురావొద్దని సూచించారు. ఇంకా.. గ్రౌండ్ లోకి సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావొద్దని స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)