కరోనా(Corona) వచ్చిన అనంతరం వైద్య విభాగంలో ఖాళీల భర్తీకి ఆయా ప్రభత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఖాళీల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు వైద్యం మరింత చేరువ చేసేందుకు పల్లె, బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో ఆయా పల్లె దవాఖానాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను జిల్లాల వారీగా ఆహ్వానిస్తోంది సీఎం కేసీఆర్ సర్కార్. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం (bhadrari kothagudem) జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం పలు ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)