తెలంగాణలో గురుకులాలు ఎంతగా సక్సెస్ అయ్యాయన్నది తెలిసిన విషయమే. దీంతో అక్కడ అడ్మిషన్లకు కూడా విపరీమైన పోటీ ఏర్పడింది. తాజాగా గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు (MJPTBCWRJC & RDC-CET-2022) సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
కాగా.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23 అంటే ఈ రోజులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఓ ప్రకటనలో తెలిపారు. రానున్న 2022-23 విద్యాసంవత్సరంలో బీసీ బాలబాలికల గురుకుల కాలేజీల్లో ఇంటర్ లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని సూచించారు.