తెలంగాణలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. జిల్లాల వారీగా ఖాళీల భర్తీకి ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
తాజాగా నల్లగొండ జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి డీఎంహెచ్ఓ(DMHO) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
మెడికల్ ఆఫీసర్ - MBBS: ఎంబీబీఎస్ లో ఉత్తీర్ణత సాధించి, తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
మెడికల్ ఆఫీసర్-Ayush: BAMS/BHMS/BUMS కోర్సులు చేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
బీఎస్సీ నర్సింగ్: బీఎస్సీ నర్సింగ్(కమ్యూనిటీ హెల్త్) చేసి టీఎస్ మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకున్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఔట్ సోర్సింగ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 28 సాయంత్రం 5 గంటలలోగా ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)