తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి హరీష్ రావు తాజాగా మరో శుభవార్త చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసులో మానిటరింగ్ హబ్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 887 పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, TSMSIDC అనుసంధానం చేశామన్నారు.