TELANGANA JOBS MLAS ARE STARTING FREE COACHING CENTERS ACROSS TELANGANA AND FREE COACHING IN TSAT TV CHANNELS SK
Telangana Jobs: నిరుద్యోగులకు మరో శుభవార్త.. పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్
Telangana Jobs: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసిన వెంటనే.. నిరుద్యోగులు మళ్లీ పుస్తకాలు తీస్తున్నారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సిద్ధమవుతన్నారు. కొందరైతే మంచి కోచింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయా? అని వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం మరో శుభవార్త వచ్చింది.
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింద. ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ-శాట్ ఛానెళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
టీశాట్ నిపుణ, టీశాట్ విద్య అనే రెండు ఛానెళ్లు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఈ టీవీ ఛానెళ్లలో పోటీ పరీక్షలకు పాఠాలు చెబుతారు. మీ ఇంట్లో కూర్చునే ఈ పాఠాలు వినొచ్చు.. స్వయంగా నోట్స్ తయారు చేసుకొని.. పరీక్షలకు సన్నద్ధమవ్వచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అంతేకాదు కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం కేంద్రంలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇవి ఏర్పాటైతే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
అందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని.. వారికి ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి వాటితో ఎంతో మంది పేద అభ్యర్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
కాగా, తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైన విషయం తెలిసిదే. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
జిల్లా స్థాయిలో 39,829, జోనల్ స్థాయిలో 18,866, మల్లీ జోనల్ స్థాయిలో 13,170 ఖాళీలు ఉన్నాయి. సెక్రటేరియెట్, హెచ్వోడీలు, విశ్వ విద్యాలయాల్లో 8,147 మంది పోస్టలను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
విద్యా శాఖలో 30,000, హోంశాఖలో 18వేలు, ఆరోగ్యశాఖలో 12వేలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి. స్థానిక అభ్యర్థులు సొంత జిల్లా, సొంత జోన్, మల్టీ జోన్లలో 95 శాతం ఉద్యోగాలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఐతే అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి కావు. అలా జరిగితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)