తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి శుభవార్త చెప్పారు. పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన (Job Notification) విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కొత్తగా ఏర్పాటుచేసిన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో బోధన సిబ్బంది నియామకాలు (Recruitment) చేపడుతున్నట్లు ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 15 గురుకుల డిగ్రీ కాలేజీల్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, జియాలజీ, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, కామర్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ తో పాటు.. (ప్రతీకాత్మక చిత్రం)
దరఖాస్తు చేసుకున్న వారికి డెమో నిర్వహిస్తామన్నారు. ఎంపిక చేయబడిన లెక్చరర్స్ గంటల ప్రకారం పని చేయాల్సి ఉంటుందని మల్లయ్య బట్టు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా జిల్లాల మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల ఆర్ సి వోలకు తమ దరఖాస్తులు అందించాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12 ఆఖరి తేదీ అని ఆయన వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)