కరోనా కారణంగా వైద్య సిబ్బంది నియామకాలు దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం దాదాపు 50 వేల మంది వైద్య సిబ్బందిని నియమించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
తాజాగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ల నియాకానికి అధికారులు ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 24 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 17న దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికేట్లతో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ బీ బ్లాక్ లోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేతనం చెల్లించనున్నారు. ఇతర పూర్తి వివరాలకు డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)