కరోనా ప్రభావం విద్యారంగంపై అధికంగా పడుతోంది. గత రెండేళ్లుగా క్లాసులు సరిగా జరగక విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రత్యక్ష తరగతులకు బదులుగా నిర్వహిస్తోన్న ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు ఎంత మేర అర్థం అవుతున్నాయో తెలియని పరిస్థితి. ఇంకా పరీక్షలు సైతం ఎప్పుడు నిర్వహిస్తారో, ఎప్పడు వాయిదా పడుతాయో తెలియని దుస్థితి. (ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా తెలంగాణలోని ప్రముఖ యూనివర్సిటీలైన జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(JNTUH) తాజాగా కీలక ప్రకటనల చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అనుబంధ కాలేజీల ప్రిన్సిపాల్స్ కు యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జనవరి 8 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉన్న ఎగ్జామ్స్ ను అధికారులు వాయిదా వేశారు. అయితే ఈ నెల 17 నుంచి జరగాల్సి ఉన్న V సెమిస్టర్ ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో విడుదల చేస్తామని యూనివర్సిటీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే గతంలో విడుదలైన ప్రకటన ప్రకారం.. తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ప్రభుత్వం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికే తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు సైతం సర్కార్ కు రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలను మరికొన్ని రోజులు మూసే ఉంచాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం సెలవులపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఈ సెలవు దినాల్లో ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)