తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు 20 రోజులకు పైగా విద్యాసంస్థలకు కేసీఆర్ సర్కార్ సెలవులు ప్రకటించింది. అయితే, వైరస్ ప్రాభావం అంతగా లేకపోవడం, విద్యార్థులకు పరీక్షలు సమీపించడం దృష్ట్యా రేపటి నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి ఈ నెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ తిరిగి ప్రారంభించడానికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే, రాష్ట్రంలోనే ప్రముఖ యూనివర్సిటీగా పేరొందిన జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ మాత్రం ఆఫ్ లైన్ క్లాసులు తిరిగి నిర్వహించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొందరు విద్యార్థులకు ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆఫ్ లైన్ క్లాసులను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. మరికొందరికి రేపటి నుంచి క్లాసులు ప్రారంభించనున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీ పరిధిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న మొదటి, రెండో ఏడాది విద్యార్థులకు ఫిబ్రవరి 12 వరకు ఆన్లైన్ విధానంలోనే క్లాసులు కొనసాగిస్తామని వెల్లడించారు. 12వ తేదీ అనంతరం ఆఫ్ లైన్ క్లాసులను కరోనా నిబంధనలను పాటిస్తూ నిర్వహిస్తామని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా.. యూజీ కోర్సులు మూడు, నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులకు(Pharm D వారితో కలిపి) విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ఉంటాయని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ క్లాసులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత కాలేజీల ప్రన్సిపాల్స్ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)