తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు సంబంధించి రోజుకో ప్రచారం సాగుతుండడంతో విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై బోర్డు సైతం క్లారిటీ ఇవ్వకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎంసెట్ ఎగ్జామ్ తేదీ దగ్గరపడుతుండడం.. మరో వైపు ఇంటర్ ఫలితాలకు సంబంధించి రోజుకో తేదీ ప్రచారంలోకి వస్తుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
రేపు అంటే సోమవారం రోజు ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారన్న ప్రచారం గత రెండు రోజులుగా జోరుగా సాగుతోంది. అయితే.. రేపు ఫలితాలను విడుదల చేసే అవకాశం లేదని తెలంగాణ ఇంటర్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. అయితే.. ఫలితాల విడుదలకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని బోర్డు వర్గాల నుంచి సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
మార్కులను క్రోడీకరించడంలో తప్పులు దొర్లడంతోనే ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడడానికి కారణమని తెలుస్తోంది. అధికారులు నిర్వహించిన ట్రయల్ లో అనేక తప్పులు దొర్లినట్లు గుర్తించడంతో.. ఇందుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో బోర్డు వర్గాలు నిమగ్నమయ్యాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పులు జరగకూడదన్న లక్ష్యంతో బోర్డు వర్గాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఫలితాల్లో తప్పులు దొర్లకుండా ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలకు విడుదలకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలను సైతం అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించి.. ఆ సమస్యలు పరిష్కారం అయినట్లు ఖచ్చితంగా నిర్ధారణ అయిన తర్వాతనే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
గతంలో సాంకేతిక సమస్యల కారణంగా ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లిన విషయం తెలిసిందే. దీంతో మనస్థాపం చెందిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. పార్టీలు, విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రాకూడదన్న లక్ష్యంతో ఇంటర్ బోర్డు అధికారులు పని చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రభుత్వం నుంచి కూడా ఇంటర్ బోర్డుకు ఈ మేరకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా సరే.. ఫలితాల్లో మాత్రం ఎలాంటి తప్పులు రావొద్దని ప్రభుత్వం ఇంటర్ బోర్డు కు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే.. అన్ని అనుకున్నట్లు జరిగితే బుధవారంలోపు ఫలితాలను విడుదల చేయాలన్నది ఇంటర్ బోర్డు ఆలోచనగా తెలుస్తోంది. రేపు సాయంత్రంలోగా ఫలితాల విడుదలకు సంబంధించిన తేదీని ఇంటర్ బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)