తెలంగాణ ఇంటర్ పరీక్షలు తేదీలు.. చెల్లించాల్సిన ఫీజు వివరాలపై ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ వార్షిక పరీక్షలను 2023 మార్చి నెలలలో నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.
2/ 6
ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజును విద్యార్థులు సోమవారం నుంచి చెల్లించాలని సూచించారు. పరీక్ష ఫీజును చెల్లించడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించినట్లు చెప్పారు.
3/ 6
విద్యార్థులు రూ.100 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు.. రూ.500 ఫీజుతో 8 నుంచి 12 వరకు.. రూ.500 లేట్ ఫీజుతో డిసెంబర్ 14 నుంచి 7 వరకు చెల్లించే అవకాశం కల్పించినట్లు వివరించారు.
4/ 6
ఇంకా రూ.2 వేల లేట్ ఫీజుతో డిసెంబర్ 19వ తేదీ నుంచి 22వరకు ఫీజును చెల్లించే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఫస్ట్ ఇయర్, సెకండియర్ జనరల్ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.500గా ఉంటుంది.
5/ 6
సైన్స్ మరియు వొకేషనల్ విద్యార్థులు రూ.710 ఫీజుగా చెల్లించాలని చెప్పారు. ఇంకా గతంలో కరోనా కారణంగా పరీక్షలకు సంబంధించి సిలబస్ ను కుదించిన విషయం తెలిసిందే.
6/ 6
అయితే.. ఈ ఏడాది 100 శాతం సిలబస్ తో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రైవేటు విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.