తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు కాకుండా ఇతరత్రా వసూళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల అన్ని యాజమాన్యాలు ఫీజు స్ట్రక్చర్, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నుంచి ట్యూషన్ ఫీజు మినహాయించి ఇతర ఏ ఫీజులు వసూలు చేయకూడదని హెచ్చరించారు. ఒక వేళ ఎవరైనా దీనిని అతిక్రమిస్తే జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఇలాంటి చర్యలకు పాల్పడిన మేనేజ్మెంట్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఇంటర్ బోర్డ్ తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు https://results.cgg.gov.in/genFirstYearIPE.do ఈ లింక్ ద్వారా తమ రిజల్ట్ ను నేరుగా చెక్ చేసుకోవచ్చు. అయితే.. ఈ సారి కేవలం 49 శాతం మాత్రమే ఉత్తీర్ణత శాతం నమోదైంది. దీంతో ఫెయిలయిన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలన్న డిమాండ్ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంటర్ జనరల్ విభాగంలో మొత్తం 4,09,991 మంది పరీక్షలకు హాజరవ్వగా కేవలం 1,99,756 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో 49, 331 మంది పరీక్షకు హాజరవ్వగా కేవలం 24,226 మంది మాత్రమే పాస్ అయ్యారు. జనరల్ లో 49 శాతం, ఒకేషనల్ లో కూడా 49 శాతం మాత్రమే పాస్ అయ్యారు. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 4,59,242 మంది పరీక్షకు (Exams) హాజరవ్వగా 2,24,012 మంది మాత్రమే పాస్ అయ్యారు. మొత్తం పాసైన వారి శాతం 49 శాతం మాత్రమే నమోదైంది. మొత్తం బాలికలు 2,26,616 మంది పరీక్షలకు హాజరవ్వగా 1, 26,289 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 56 శాతంగా నమోదైంది.(ప్రతీకాత్మక చిత్రం)
బాలుర విషయానికి వస్తే 2,36,626 మంది పరీక్షకు హాజరు కాగా కేవలం 97,723 మంది మాత్రమే పాస్ అయ్యారు. బాలుర పాస్ శాతం కేవలం 42 శాతంగా నమోదైంది. దీంతో ఉత్తీర్ణత శాతంలో మరో సారి బాలికలే పై చేయి సాధించారు. అయితే.. 2020లో 60 శాతం, అంతకు ముందు 2019లో 59.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే కరోనా నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 49 శాతానికి పడిపోయింది.(ప్రతీకాత్మక చిత్రం)