తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఈ విద్యాసంవత్సరం 2022-23కు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 20, సోమవారం నుంచి ప్రారంభంకానున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఈ మేరకు శనివారం షెడ్యూల్ ను విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫస్టియర్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 20 నుంచి జులై 20 వరకు నెల రోజుల వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన ప్రవేశాలను జూన్ 27 నుంచి జులై 20 వరకు మొదటి విడత ప్రవేశాలను నిర్వహిస్తారు. జులై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇంటర్ బోర్డు 2022-23 అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
221 వర్కింగ్ డేస్ తో విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 9 వరకు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు ఉంటాయని బోర్డు ప్రకటించింది. 2023 జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)