తెలంగాణ ఇంటర్ బోర్డ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే విద్యార్థులను 15 నిమిషాల వరకు ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతిస్తామని వెల్లడించింది. అయితే.. 15 నిమిషాల తర్వాత వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9 వరకు సెకండియర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను నిర్వహించనుంది.