తెలంగాణ ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. రానున్న పబ్లిక్ ఎగ్జామ్స్ కు ఎంత మేరకు సిలబస్ ఉంటుందనే అంశంపై స్పష్టత ఇచ్చింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఇంటర్ సిలబస్ ను 70 శాతానికి కుదించింది ఇంటర్ బోర్డ్. క్లాసులు సరిగా జరకగకపోవడం, సిలబస్ పూర్తి కాకపోవడం తదితర కారణాలతో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా సిలబస్ ను తగ్గించారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఈ సారి కరోనా ప్రభావం దాదాపుగా తగ్గిపోవడం.. జూన్ 15 నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి స్థాయిలో ఫిజికల్ తరగతులు జరుగుతుండడంతో 100 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది ఇంటర్ బోర్డ్. ఈ సారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులందరికీ ఈ ప్రకటన వర్తిస్తుందని బోర్డ్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)