తెలంగాణ ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇంటర్ సెలవులకు సంబంధించిన తేదీలను విడుదల చేసింది. రేపటి నుంచి అంటే అక్టోబర్ 2వ తేదీ ఆదివారం నుంచి 9వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులను ప్రకటించింది ఇంటర్ బోర్డ్. అన్ని కాలేజీలు ఈ సెలవులను తప్పనిసరిగా పాటించాలని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
సెలవుల్లో ఏదైనా కాలేజీ యాజమాన్యాలు క్లాసులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ వార్నింగ్ ఇచ్చింది. సెలవుల తర్వాత ఈ నెల 10వ తేదీన కాలేజీలను తిరిగి ప్రారంభించాలని స్పష్టం చేసింది ఇంటర్ బోర్డ్. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకుల కాలేజీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. తెలంగాణలోని స్కూళ్లకు 15 రోజులు దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. దీనిలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 9న ఆదివారాలు రావడంతో.. సెలవులు 15 రోజులకు పెరిగింది. తిరిగి పాఠశాలలు అక్టోబర్ 10న ప్రారంభం అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)