1. ఈసారి తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ నిత్యం వార్తల్లో నిలిచింది. జేఈఈ పరీక్షల షెడ్యూల్ మార్చడం కారణంగా తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ని కూడా సవరించాల్సి వచ్చింది. మొత్తానికి మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ (TS Inter Exams) ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) మార్చిలో ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు మే 6 నుంచి మే 24 వరకు జరగనున్నాయి. సుమారు 9 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. అయితే ఈసారి ఇంటర్ విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పింది ఇంటర్ బోర్డు. ఫస్ట్ ఇయర్ పేపర్లకు సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం కల్పించింది ఇంటర్ బోర్డు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్లకు సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ రాస్తే ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు. ఆ మార్కులతోనే ఇంటర్ మెమో వస్తుంది. గతంలో ఉన్న విధానం చూస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లోనే ఇంప్రూవ్మెంట్ రాసుకునే ఛాన్స్ ఉండేది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కానీ ప్రస్తుతం ఇంటర్ బోర్డు మార్చిన విధానం ప్రకారం గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాసైన విద్యార్థులు ఈ ఏడాది జరగబోయే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల సమయంలో ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం కల్పించింది. గతేడాది మార్కులు, ఇంప్రూవ్‌మెంట్‌లో వచ్చే మార్కులను పరిశీలించి ఎందులో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో వారికి 35 శాతం మార్కులు వేసి పాస్ చేశారు. సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ రాసే ఛాన్స్ ఇస్తామని అప్పుడే ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. గతంలో ప్రకటించినట్టుగా ఇప్పుడు విద్యార్థులకు సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశం ఈ ఒక్క ఏడాది మాత్రమే ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి పాత విధానం అమల్లోకి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు గతంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కాలేదు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పదవ తరగతి విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేశారు. ఆ బ్యాచ్‌ల విద్యార్థులే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు కూడా 70 శాతం సిలబస్ ప్రకారమే జరగనున్నాయి. దీంతో పాటు ప్రశ్నాపత్రాల్లో విద్యార్థులకు ఛాయిస్ శాతం కూడా పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ చూస్తే మే 6న 2nd లాంగ్వేజ్ పేపర్ I, మే 9న ఇంగ్లీష్ పేపర్-I, మే 11న మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్ I, మే 13న మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్ I, మే 16న ఫిజిక్స్ పేపర్-I, ఎకనమిక్స్ పేపర్ I, మే 18న కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ I, మే 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు), మే 23న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I పరీక్షలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ చూస్తే మే 7న 2nd లాంగ్వేజ్ పేపర్ II, మే 10న ఇంగ్లీష్ పేపర్-II, మే 12న మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్ II, మే 14న మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్ II, మే 17న ఫిజిక్స్ పేపర్-II, ఎకనమిక్స్ పేపర్ II, మే 19న కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ IIమే 21న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)మే 24న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II పరీక్షలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)