తెలంగాణలో ప్రధాన పండుగలైన బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో విద్యాసంస్థలకు భారీగా సెలవులు ప్రకటిస్తోంది ప్రభుత్వం. స్కూళ్లకు ఇప్పటికే 15 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (SCERT) అభ్యంతరం వ్యక్తం చేసినా విద్యాశాఖ మాత్రం వెనక్కి తగ్గలేదు. సెలవులను తగ్గించేది లేదని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. తాజాగా ఇంటర్ బోర్డ్ సైతం సెలవులపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుంచి 9 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ కాలేజీలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయిని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు 8 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)