తెలంగాణలో ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు గతంలో వెయిటేజీ ఉండేది. అయితే.. కరోనా నేపథ్యంలో 2020, 2021, 2022 ఎంసెట్ ఎగ్జామ్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీని ఎత్తేసింది ఉన్నత విద్యామండలి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అయితే.. ఇక మీదట కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల్లో కూడా ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఇంకా.. వివిధ బోర్డుల్లో 12వ తరగతి చదివే విద్యార్థులు సైతం ఎంసెట్ రాస్తుంటారు. అయితే.. వీరికి సంబంధించి ఏ ఒక్క బోర్డు నుంచి సంబంధిత 12వ తరగతి ఫలితాలు విడుదల ఆలస్యమైనా.. ఆ ప్రభావం ఎంసెట్ ఫలితాలపై పడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
దీంతో ఎంసెట్ ర్యాంకుల ప్రకటనతో పాటు.. కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ లేట్ అవుతోంది. ఈ నేపథ్యంలో కేవలం ఎంసెట్ మార్కులను మాత్రమే ర్యాంకుల కేటాయింపునకు పరిగణలోకి తీసుకోవాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఈ అంశంపై ఉన్నత విద్యా శాఖ కార్యదర్శితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. ఇలా జరిగితే ప్రభుత్వ కాలేజీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ప్రైవేట్, కార్పోరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులలో పోటీ పడలేక వీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ తో పోల్చితే ఎంసెట్ పరీక్ష కఠినంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ప్రత్యేక శిక్షణ పొందే వారితో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఈ పరీక్ష రాణించడం కాస్త ఇబ్బంది కరంగా ఉంటుంది. ఇలాంటి వారికి ఎంసెట్ పరీక్షలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)