తెలంగాణ హైకోర్టు (Telangana High Court) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. మొత్తం 85 ఖాళీలు ఉన్నాయి. దీనిలో టైపిస్ట్ పోస్టులు 43 ఉండగా.. కాపీయిస్ట్ పోస్టులు 42 ఖాళీలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. విద్యార్హతల వివరాలు చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. కామర్స్ లేదా సైన్స్ లేదా ఆర్ట్స్(Arts) లేదా లా(Law)లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
వీటితో పాటు.. తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి. కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగే క్వాలిఫికేషన్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2022 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
స్పోర్ట్స్ కోటా మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వారికి ఏమైనా వేకెన్సీ ఉంటే.. సంబంధిత తరగతి మరియు కేటగిరీ ప్రకారం నిర్దేశించిన విధంగా పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష 40 మార్కులు , ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్టుకు 40 మార్కులు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా ఇక్కడ క్లిక్ చేసి పార్ట్ ఏలో వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. అభ్యర్థి మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి OTPR ID, పాస్వర్డ్ వస్తాయి. ఈ వివరాలతో లాగిన్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉమ్మడి మూడు జిల్లాలో నిర్వహించనున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ సెప్టెంబర్ 5న డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 25న రాత పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in/ ను సందర్శించాలి.