దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ నిత్యం 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గకపోవడంతో ముందు జాగ్రత్తగా సెలవులను పొడిగించమే మంచిదని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. వాస్తవానికి ఈ నెల 17న రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించాల్సి ఉంది. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఈ నెల 8 నుంచి 16 వరకు గతంలో ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే 17న విద్యాసంస్థలను తిరిగి తెరిచే పరిస్థితి లేదని అధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సైతం ప్రభుత్వానికి ఇలాంటి సూచనలే చేసింది. దీంతో ప్రభుత్వం సెలవుల పెంపుపై నిర్ణయం తీసుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపటి లోగా ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు విద్యాసంస్థలు 17న ప్రారంభమవుతాయనే భావించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మేరకు సిద్ధంగా ఉండాలని వారు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)