Telangana New Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు..
Telangana New Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు..
Telangana New Jobs: తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో 9 మెడికల్ కాలేజీల్లో 313 పోస్టులు మంజూరు చేశారు.
తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో 9 మెడికల్ కాలేజీల్లో 313 పోస్టులు మంజూరు చేశారు.
2/ 7
313 పోస్టుల్లో క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను వీటి ద్వారా భర్తీ చేయనున్నారు. అంతే కాకుండా.. ఇటీవల తెలంగాణలో మరో 2,391 కొత్త ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన పోస్టుల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్(Junior College Lecturers), డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్(Degree College Lecturers) వంటి పోస్టులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నుంచి 141 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. గ్రూప్ 4లోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు , మహాత్మాజ్యోతి బాఫూలే వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ నుంచి అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
141 పోస్టులను గ్రప్ 4 కేటగిరీల్లో కలపడంతో.. ఆ సంఖ్య 8140 పోస్టులకు పెరిగిన విషయం తెలిసిందే. వీటితో పాటు.. మరో 1499 టీజీటీ, పీజీటీ తదితర పోస్టులు కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఇక ఇటు.. ఉద్యోగాల కోసం అభ్యర్థులు డబ్బులిచ్చి మోసపోవద్దని ఉద్యోగాల భర్తీపై TSPSC కీలక ప్రకటన చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
భారీగా రిలీజ్ అయిన ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉద్యోగాల కోసం అభ్యర్థులు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించింది. (ప్రతీకాత్మక చిత్రం)