1. ఇటీవల తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయి. టెన్త్ తర్వాత పైచదువులు చదివేవారు ఉంటారు. టెన్త్ తర్వాత చదవడానికి చాలా కోర్సులు ఉంటాయి. టెన్త్ తర్వాత ఉద్యోగాల వేట మొదలుపెట్టేవారు కూడా ఉంటారు. పదవ తరగతి అర్హతతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (Central Govt Jobs) ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు, విభాగాల్లో కింది స్థాయి ఉద్యోగాలకు పదవ తరగతి పాసైతే చాలు. ఇప్పటి నుంచే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే గవర్నమెంట్ జాబ్ సంపాదించవచ్చు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 9,618 పోస్టుల్ని భర్తీ చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. గ్రూప్ 4 లో ఇందులో 10వ తరగతి అర్హతతో కొన్ని పోస్టులు ఉంటాయి. దీంతో పాటు విలేజ్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసే నోటిఫికేషన్లలో కూడా టెన్త్ అర్హతతో పోస్టులు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్స్ ఫాలో అవుతూ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భర్తీ చేసే ఉద్యోగాల్లో టెన్త్ అర్హతతో వేల సంఖ్యలో పోస్టులు ఉంటాయి. రెగ్యులర్‌గా భర్తీ చేసే పోస్టులు కాకుండా త్వరలో 70,000 పైగా అదనంగా పోస్టుల్ని భర్తీ చేస్తామని ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసే నోటిఫికేషన్లలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు టెన్త్ పాసైతే చాలు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేసే పోస్టుల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్స్ పోస్టులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇవి కాకుండా టెన్త్ అర్హతతో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఉంటాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ లాంటి భద్రతా దళాలు టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక రైల్వేలో గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాలకు కూడా 10వ తరగతి పాసైతే చాలు. ఇండియా పోస్ట్ కూడా టెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటుంది. ఇటీవల దేశవ్యాప్తంగా 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది. ఫలితాలు కూడా రాష్ట్రాల వారీగా విడుదల చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)