ఈ నెల 16న తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 503 భారీ పోస్టులతో విడుదల తొలి నోటిఫికేషన్ కావడంతో 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైతం అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ ఎగ్జామ్ ను నిర్వహించింది. దీంతో పరీక్ష సజావుగా ముగిసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే పరీక్ష ముగిసిన అనంతరం అత్యంత భారీ బందోబస్తుతో ఓఎంఆర్ షీట్లను హైదరాబాద్ కు తరలించింది టీఎస్పీఎస్సీ. అయితే.. ఈ సారి ఓఎంఆర్ స్కాన్ కాపీలను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనుంది టీఎస్పీఎస్సీ. ఈ మేరకు ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. రోజుకు 40 వేల ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ పక్రియ పూర్తి కావడానికి వారం రోజుల సమయం పట్టనుంది. స్కానింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా కాపీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ తదితర వివరాలను నమోదు చేసి స్కానింగ్ కాపీలను చూసుకునే అవకాశం కల్పించనున్నారు. తర్వాత ప్రిలిమ్స్ కీని విడుదల చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)